06-02-2026 12:00:00 AM
మధిర సీఐ రమేష్ చేతుల మీదుగా ప్రారంభం..
700 మంది క్రీడాకారుల హాజరు..
క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాట్లు..
ఎర్రుపాలెం ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మదిర నియోజకవర్గ స్థాయి సీఎం కప్పు టోర్నమెంట్ గురువారం మదిర ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైనవి. మధిర రూర ల్ సీఐ రమేష్ మధిర విద్యాశాఖ అధికారి ప్రభాకర్ క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు.
ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని,ముదిగొండ, మండలాల నుండి క్రీడాకారులు 700 మంది హాజరయ్యారు. కబడ్డీ ఖోఖో, వాలీబాల్.. క్రీడలు మొదటి రోజు విజేతలు.. కబడ్డీ పురుషులు విభాగం మొదటి బహుమతి ఎర్రుపాయలు మండ లం, రెండవ బహుమతిరి మధిర.. కబడ్డీ బాలికల విభాగం మొదటి బహుమతి మధిర, రెండవ బహుమతి ఎర్రుపాలెం. ఖో ఖో మొదటి బహుమతి బాలురు విభాగం మధిర,.. రెండవ బహుమతి, ఎర్రుపాలెం, బాలికల విభాగం ఖో ఖో మొదటి బహుమతి మధిర... 2వ బహుమతి ఎర్రుపాలెం, వాలీబాల్ బాలురు విభాగం, మొదటి బహుమతి చింతకాని, రెండవ బహుమతి మధిర, బాలికల విభాగం, మొదటి బహుమతి మధిర.. రెండవ బహుమతి చింతకాని, విజేతలుగా నిలిచారు.
నేడు 6 తారీకు షటిల్, క్యారమ్, చెస్, అద్లెటిక్సు, కరాటే, యోగ,పోటీలు జరుగును. క్రీడాకారులకు బోజన వసతి ఏర్పాటు చేశారు . మొత్తం 700 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొన్నటు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.చిన్ని తెలిపారు. యస్ జి యఫ్ సెక్రటరీ వై రామారావు, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మారాబత్తుల జమలయ్య, శ్రీనివాస్ రావు, చైతన్య, బి. శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, క్రిష్ణా రావు, నాగేశ్వరావు,రవికుమార్, మాదవ రావు, రవి, నరసింహ రావు పాల్గొన్నారు.