5 July, 2026 | 11:48 AM

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

05-07-2026 11:30 AM

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 పై  ఆదివారం ఉదయం జరిగిన ఘోర  రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్ డి కొనడంతో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నారు. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఘటనాస్థలిలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.