అనారోగ్య బాధితుడికి రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత
17-06-2026 05:32 PM
చిట్యాల,(విజయక్రాంతి): కేతపల్లి మండలం గుడివాడ గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల శివ అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని, ప్రజల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.






