17 June, 2026 | 6:10 PM

గ్రామస్తుల దాహార్తిని తీర్చిన సర్పంచ్ ఆనంద్ నాయక్.

17-06-2026 04:48 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా  పెద్దముల్ మండలం కందనెల్లి తండాలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి ఎద్దడిని గ్రామ సర్పంచ్ ఆనంద నాయక్ నూతనంగా బోరు మోటర్ బిగించి దాహార్తిని తీర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆనంద్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజుల నుండి బోరు మోటర్ మరమ్మతులు చేసిన లాభం లేకుండా పోయిందని నేడు తాజాగా నూతన బోరు మోటర్ ను బిగించామని అన్నారు. గ్రామ ప్రజలు తాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని...ఇంటి పరిసరాలు శుభ్రంగా చేసుకొని రోగాలు దరిచేరకుండా చూసుకుంటూ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.