లాటరీలో వరించిన అదృష్టం
కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపిక
కూకట్‌పల్లి, ఆగస్టు 29 (జయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని లక్ష్యంతో నగరంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపికను శనివారం కేపీహెచ్ బి కాలనీ లోని హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
ఆర్డిఓ రవీందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డ్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చూడడానికి భారీ ఎత్తున దరఖాస్తుదారులు హాజ రయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రిజర్వేషన్ల పద్ధతిలో ఎస్‌సి లలో 696 మందిని అర్హులుగా గుర్తించి, అందులో 14 శాతం రిజర్వేషన్లులో భా గం గా 67 మందికి లాటరీ పద్ధతిలో కేటాయించామన్నారు. ఎస్టిలలో 135 మందిని అర్హు లుగా గుర్తించి, అందులో 5 శాతం రిజర్వేషన్లులో భాగంగా 24 మందికి లాటరీ ప ద్ధతిలో కేటాయించామన్నారు. ఓబీసీలలో 3 610 మందిని అర్హులుగా గుర్తించి,
అందులో 16 శాతం రిజర్వేషన్లులో భాగంగా 77 మందికి లాటరీ పద్ధతిలో కేటాయించామన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లులో భాగంగా 48 కేటాయించినప్పటికీ 15 మంది లబ్జాలను ఎంపిక చేశామని.. ఇంకా 33 మందిని ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు అ న్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. విస్తృతంగా ప్రచా రం నిర్వహించలేదని, మీ సేవలో దరఖాస్తు సమయంలో ఔట్ సోర్సింగ్ ఆప్షన్ ఎందు కు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాగా ఎస్సీ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు రావడంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్సీ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థుల పేర్లు ఎలా వచ్చాయంటూ అధికారులను దరఖాస్తుదారులు ప్రశ్నించారు. తమకు అన్యాయం జరు గుతోందంటూ పలువురు దరఖాస్తుదారు లు స్ట్పేకి వెళ్లి ఎస్సీ, ఓబీసీ హౌసింగ్ బోర్డు అధికారులను నిలదీశారు. దీంతో తాత్కాలికంగా డ్రా ఎంపిక నిలిచిపోయింది. అధికారులు దరఖాస్తుదారులకు సర్ది చెప్పి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అనంతరం సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.






