ప్రేమ ఓ ప్రేమ..
నవీన్‌చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినిమాను హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వీ, శరత్ లోహితశ్వ, జెమినీ సురేశ్, దిల్ రమేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ ప్రేమగీతం విడుదలైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ఈ మెలోడియస్ సాంగ్ ‘ప్రేమ ఓ ప్రేమ‘ అనే పల్లవితో మొదలైంది. ఈ పాటకు సంగీతం సుధాకర్ మారియో సమకూర్చారు. ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో; నేపథ్య సంగీతం: సంజీవ్ మేగోటి; ఫైట్స్:- డ్రాగన్ ప్రకాశ్ ఆర్ట్: కేవీ రమణ; ఎడిటర్: అనుగోజు రేణుకాబాబు.




