17 May, 2026 | 4:02 AM

ప్రేమ.. ద్రోహం.. ప్రతీకారం.. ‘మరీచిక’

17-05-2026 12:38 AM

డైరెక్టర్ సతీశ్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవ డానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో రెజీనా కసాం డ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 29న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్.. ఎమోషన్స్‌తోపాటు మిస్టరీ అంశాలతో ప్రారంభమైంది. ఇందులో వెంకట లక్ష్మి (అనుపమ పరమేశ్వరన్), సంజు  (విరాజ్ అశ్విన్), మరీచిక (  కసాండ్రా).. ఈ మూడు పాత్రల మధ్య జరిగిన ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, టర్న్‌లతో సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా; కథ, సాహిత్యం, మాటలు: లక్ష్మి భూపాల; సినిమాటోగ్రఫీ: అరవింద్ కన్నబిరన్; ఎడిటర్: జునైద్ సిద్ధికీ; ఆర్ట్: విఠల్ కోసనం.