14 July, 2026 | 5:27 AM

విద్యార్థులకు లాంగ్ నోట్‌బుక్స్

14-07-2026 12:00 AM

వాసవి క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పంపిణీ

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ఉద్దేశ్యంతో వాసవి క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్, ఐమ్యాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న ఇందిరానగర్‌లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా లాంగ్ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

క్లబ్ అధ్యక్షుడు అల్లాడి హరీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కూన వెంకటేష్ రాజ్, కోశాధికారి కొండూరు సృజున్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల7 నుంచి 13 వరకు వాసవి పుస్తక విద్యా వికాస వారోత్సవాలు పేరుతో హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాల్లోని పలు పాఠశాలల్లో ప్రతిరోజూ ఉచిత లాంగ్ నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పంపిణీ చేస్తున్న నోట్‌బుక్స్‌కు క్లబ్‌కు చెందిన ఉదార దాతల సహకారంతో సిద్ధం చేశారు. వారి సహృదయ సహకారంతో ఈ విద్యా సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

సోమవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ అధ్యక్షుడు కొల్పూరు రమేష్ విచ్చేసి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నోట్‌బుక్స్ కన్వీనర్, మాజీ అధ్యక్షుడు కూర్ రఘువీర్, సహ కన్వీనర్, మాజీ అధ్యక్షుడు ఎల్లూరి నరేంద్ర కుమార్, అనంతుల దయాకర్, ప్రాజెక్ట్ చైర్మన్ కోటికి హరీష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్ హైద రాబాద్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ క్లబ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.