14 July, 2026 | 7:28 PM

Breaking News

వేంసూరు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ శ్రీ దోమ ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు   •   శ్రీనిధి రుణాల రికవరీని వేగవంతం చేయండి   •   300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న కల్హేర్ పోలీసులు   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •  

కార్మికుల ఐక్యత వర్థిల్లాలి

02-05-2026 02:00 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఉప్పల్‌లోని ఎన్‌ఆర్బీ బేరింగ్స్ కంపెనీలో కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మల్లన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి పరిస్థితుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను వివరించారు. కష్టజీవుల శ్రమతోనే సమాజం ముందుకు సాగుతోందని, కానీ వారికి సరైన గౌరవం, భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి కార్మికుడికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన, టీఆర్‌కేవీలో సభ్యత్వం పొందిన ప్రతి కార్మికుడికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంకూరి శ్రీనివాస్, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు.