13 August, 2026 | 6:42 AM

పళ్లబురుసుకు తగ్గ లొకేషన్స్ లచ్చపేటలో దొరికాయి!

13-08-2026 12:23 AM

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పళ్లబురుసు’. సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా విశేషాలను డైరెక్టర్ ఉదయ్ విలేకరులతో పంచుకున్నారు. “నేను మహబూబ్‌నగర్‌లోనే పుట్టాను. ఊర్లో జరిగే సంఘటనలు, అక్కడి పాత్రలను చాలా జాగ్రత్తగా పరిశీలించేవాడిని. నాకు టౌన్‌లో ఉండడం కంటే ఊరిలో ఉండడం ఇష్టం.

అక్కడి ప్రజలు నాపై చూపించే అభిమానం చాలా ఆనందాన్నిచ్చేది. ఊర్లో చాలా ప్రశాంతత ఉంటుంది. అక్కడ చాలా మంచి కథలు ఉంటాయి. ఆ కథల్లో ఉండే స్వచ్ఛత నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా చాలా మంచి వినోదం, మనసును హత్తుకునే సందేశం కూడా ఉంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కెమిస్ట్రీ తెరపై చాలా అద్భుతంగా ఉంటుంది. -సిద్దిపేట లచ్చపేట ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. కథకు సరిపోయే లొకేషన్స్, సీన్స్ అక్కడ చాలా సహజంగా దొరికాయి. -నాగార్జున సినిమా చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని అన్నారు.

ఆయన ఇచ్చిన సలహాలు మాకు చాలా ఉపయోగపడ్డాయి. ‘పళ్లబురుసు’ కోసం కేసు పెట్టడం ఏంటి? దానికంటే లాయర్ ఖర్చులే ఎక్కువ కదా అనే లాజిక్ ఉంది కదా! నిజానికి ఇలాంటి క్యూరియాసిటీ రావాలనే నేను అలా రాశాను. ఆ కేసు వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అవన్నీ సినిమాలో చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.