నియోజకవర్గానికి అదనపు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయండి.
మంత్రి పొంగులేటిని కలిసిన మాజీ కేంద్రమంత్రి తో పాటు స్థానిక నాయకులు.
బోథ్,(విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలో పేద ప్రజలందరికీ ఇళ్లు మంజూరు అయ్యేవిధంగా చూడాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బూత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ కోరారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి తో కలిసి శనివారం రాష్ట్రమంత్రిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలో అనేకమంది పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని వారికి ఇండ్ల మంజూరి ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బోత్ ఆత్మ బ్లాక్ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ ,బోత్ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహ దాస్ ,సహకార సంఘం మాజీ డైరెక్టర్ చట్ల ఉమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి, యువ నాయకులు ఆలపాటి అచ్చితానంద రెడ్డి, తోపాటు ఎండి సద్దాం, హీరసింగ్ ,రాహుల్ తదితరులు ఉన్నారు.






