18 April, 2026 | 5:32 PM

దేశ చరిత్రలో 17 ఏప్రిల్ చీకటి రోజు

18-04-2026 04:12 PM

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ సునీల్ రావు

ముకరంపుర,(విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో ఏప్రిల్ 17 మహిళల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ మిగిల్చిన చీకటి రోజుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో శనివారం రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పూర్వ ప్రధాన మంత్రి దేవెగౌడ, అలాగే అటల్ బిహారీ వాజ్ పాయ్ మహిళా బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వాటి మిత్ర పక్షాలు అడ్డుకున్నారు.

గత 40 సంవత్సరాల కాలం నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ వాటి మిత్రపక్షాలు మహిళ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్నాయని ద్వజమెత్తారు. 2010 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ లో బిల్లు తీసుకొస్తే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. రాజ్యసభలో బిల్లు పాస్ చేసి. లోక్ సభకు బిల్లు రాకుండ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

2023లో మల్లీ ప్రధాన మంత్రి మోడి లోక్ సభలో బిల్లును పాస్ చేయిస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రధాన మంత్రి మోడి 2029 లో మహిళలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని, సబంధిత 334 ఏ ఆర్టికల్ సవరించాలని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. మహిళల ఆశలను అడియాశలు చేసి వారి అవకాశాలకు గండి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ద్వజమెత్తారు. ఈ సమావేశంలో బిజెపి  కి చెందిన కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు