calender_icon.png 16 February, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు కోరం.. ఇస్తే తీసుకుంటాం!

16-02-2026 01:34:50 AM

హంగ్ మున్సిపాలిటీల్లో స్థానిక నాయకులదే బాధ్యత

ఐటీడీఏ నిధులతోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి

గిరిజనులను విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాల కోసం ఏ పార్టీ మద్దతు కోరమని, అయితే స్వచ్ఛందంగా ఇస్తే మాత్రం తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రా వు తెలిపారు. హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో అక్కడి స్థానిక నాయకులదే పూర్తి బా ధ్యత అని తెలిపారు. బీజేపీకి సీట్లు రాకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి అడ్డుకున్నాయని విమర్శించారు. ఈ పార్టీల మధ్య ఉన్న బంధం బయటపడిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు శాతం పెరిగిందని తెలిపారు.

గతంలో కంటే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షు డు రవినాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు.

తెలంగాణ రాష్ర్టంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వాలు తండాల అభివృద్ధిని నిర్ల క్ష్యం చేశాయని విమర్శించారు. తండాలను పంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, నిధు లు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. నేడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారా నే సాధ్యమవుతోందని తెలిపారు. గిరిజనుల హక్కులు, అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ వారి వెంట నిలుస్తుందని స్పష్టం చేశారు.

మోదీ పాలనలో గిరిజనుల సంక్షేమం 

గిరిజనుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది నరేంద్ర మోదీ ప్రభు త్వమేనని స్పష్టం చేశారు. ట్రైబల్ కమిషన్ ఏర్పాటు, ప్రత్యేకంగా ట్రైబల్ మినిస్ట్రీ, గిరిజ న సంక్షేమానికి అత్యధిక నిధుల కేటాయిం పు.. ఇవన్నీ మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలేనని గుర్తు చేశారు. ములుగులో సమ్మక్క- ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం చేపట్టడం గిరిజన సంసృ్కతికి ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు. 

గిరి జన సమాజాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సేవాలాల్ మహారాజ్ జీవితం భార తీయ జనతా పార్టీ నమ్మే సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని పేర్కొన్నారు. జగదాంబ మాత ఉపాసకుడిగా, భక్తిశ్రద్ధలతో జీవించిన సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్  పాల్గొన్నారు.