calender_icon.png 16 February, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ విప్లవం

16-02-2026 01:35:29 AM

‘టీ-ఫైబర్’తో ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్

  1. రాష్ట్ర నలుమూలలకూ డిజిటల్ కనెక్టివిటీ
  2. గ్రామీణ ప్రాంతాలకూ ఏఐ ల్యాబ్స్, గ్లోబల్ టెక్నాలజీ
  3. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
  4. రాష్ట్రమంతటా విస్తరించేందుకు 43,000 కి.మీ మేర ఆప్టిక్ కేబుల్స్
  5. నెలకు కేవలం350కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ
  6. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఊహించని వేగంతో తన పరిధుల్ని విస్తరించుకుంటోంది. ఇంటర్నెట్.. అనే కంటి కి కనిపించని వస్తువు.. కేవలం సమాచా ర మార్పిడికి పరిమితం కాకుండా, ఒక మనిషి అభ్యున్నతికీ దోహదపడుతున్నది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకా శాలు సమకూరుస్తున్నది. సమగ్ర సామాజిక ప్రగతికి మూలస్తంభంగా నిలుస్తోం ది. ప్రపంచ బ్యాంక్ నివేదికల ప్రకారం..

ఏదైనా ఒక ప్రాంతంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగం 10 శాతం పెరిగితే, దేశ జీడీ పీ సుమారు 2 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం డిటిజల్ కనెక్టివిటీపై దృష్టి సారించింది. ప్రతి పౌరుడికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసు కురావాలని సంకల్పించింది. దీనిలో భాగంగానే టీఢూ -ఫైబర్’ ప్రాజెక్టుకు శ్రీకా రం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచనతో పైలట్ ప్రాజెక్ట్‌గా యంత్రాంగం పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్‌లో ప్రాజెక్ట్‌ను ప్రయోగించి సత్ఫలితాలు సాధించింది.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలంగాణ టీ-ఫైబర్ నమూనాను ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సైతం గ్రామంలో పర్యటించి అమలు విధానాన్ని అధ్యయనం చేయడం విశేషం. దీంతో టీ ఫైబర్‌ను రాష్ట్ర నలుమూలల విస్తరించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. గ్రామాలకు, నగరాలకు మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తొలగించడమే లక్ష్యంగా సర్కార్ సుమారు 43,000 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను విస్తరించింది.

ఈ బృహత్తర ప్రాజెక్ట్ ద్వారా కేవలం డిజిటల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అతి తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలీమెడిసిన్ వంటి సేవలు అందనున్నాయి. తెలంగాణ ప్రజలను డిజిటల్ యుగంలోకి మళ్లించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ఇది కేవలం ఒక మౌ లిక సదుపాయాల ప్రాజెక్ట్ మాత్రమే కాదు. రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు వేస్తున్న పటిష్టమైన డిజిటల్ పునాది. 

తక్కువ ధరకే అన్ని సేవలు..

రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల 2,000 ప్రభు త్వ పాఠశాలలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేందుకు వర్క్ ఆర్డర్ జారీ చేసింది. అదేవి ధంగా రాష్ట్రవ్యాప్తంగా 1,500 రైతు వేదికలు ఇప్పటికే అనుసంధానమయ్యాయి. జీఓ ఎంఎస్ నంబర్ 9 ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ తప్పనిసరి చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు టీ-ఫైబర్‌ను ప్రాథమిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ ర్‌గా వినియోగించాలి. ప్రభుత్వం గ్రామాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ, వర్చువల్ డెస్క్‌టాప్, ఏఐ టూల్స్, టెలీమెడిసిన్, సీసీటీవీ సర్వైలెన్స్, ఈ- వంటి సేవలు నెలకు కేవలం రూ.350 ధరకే అందుబాటులోకి వస్తాయి.

హైస్పీడ్ ఇంటర్నెట్..

‘టీఫైబర్’ను ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ద్వారా కాంతి తరంగాల సహాయంతో డేటా ను ప్రసారం చేయడం వల్ల ఇది కాపర్ కేబుల్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. పైగా ఎఫ్టీటీహెచ్ సాంకేతికత ఎక్కడా సాంకేతిక సమస్యలు తలెత్తనీయదు. దీంతో ఆన్‌లైన్ మీటింగ్స్, టెలీమెడిసిన్, ఏఐ టూల్స్ పనులు సజావుగా నడుస్తాయి. ముఖ్యంగా విద్యార్థుల చదువు విషయంలో లైవ్ ఆన్‌లైన్ క్లాసులు, వైద్యరంగంలో టెలీమెడిసిన్ కన్సల్టేషన్లు, వ్యవసాయంలో మార్కెట్ ధరల అప్‌డేట్స్, పాలనలో ఈలూఊ-వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సేవలకు సాంకేతికత ఊపిరి పోస్తుంది.

టీ-ఫైబర్ కేవలం ఇంటర్నెట్ సేవలకే పరిమితం కాకుండా కేబుల్ టీవీ, ఓటీటీ సేవలనూ కనెక్షన్ ద్వారా అందిస్తోంది. హై డెఫినిషన్ ఛానెల్స్, స్పష్టమైన ఆడియో, వీడియో నాణ్యతతో వాతావరణ ప్రభావం లేకుండా ప్రసారాలు అందుతాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాజా సినిమాలు, క్రీడా ఈవెంట్లు, డిజిటల్ లెర్నింగ్ వీడియోలు అందుబాటులోకి వచ్చి గ్రామ-నగర వినోద అంతరాన్ని తగ్గిస్తున్నాయి.

అందుబాటులోకి ఏఐ టూల్స్..

హైస్పీడ్ కనెక్టివిటీతో చాట్‌బాట్లు, లాంగ్వే జ్ ట్రాన్సేషన్ టూల్స్, వాయిస్ అసిస్టెంట్స్ వంటి ఏఐ టూల్స్ గ్రామాల దాకా చేరుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాం పూర్ గ్రామంలో విద్యార్థులు ప్రపంచ స్థాయి డిజిటల్ టూల్స్ వినియోగించడం ఒక మైలురాయి. ఏఐ టూల్స్ ద్వారా రైతు లు పంట దిగుబడి అంచనాలు, వాతావరణ విశ్లేషణ, వ్యాధుల గుర్తింపు వంటి నిర్ణయా లు తీసుకోవచ్చు.

భవిష్యత్తులో తెలంగాణ యువత ఏఐ ఆధారిత స్టార్టప్లు సృష్టిం చే దిశగా ఇది అడుగులు వేస్తోంది. టీ-ఫైబర్ డిజిటల్ మౌలిక వసతులతో టెలీమెడిసిన్ సేవలు గ్రామాల దాకా చేరుతున్నాయి. వీడి యో కన్సల్టేషన్ ద్వారా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పట్టణ నిపుణులతో అనుసంధానమవుతాయి. దీనివల్ల ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో త్వరగా వైద్య సలహా అందుతుంది. గర్భిణులు, వృద్ధులు ఇంటి దగ్గరే వైద్య సహా యం పొందగలరు. టీ-ఫైబర్ హైస్పీడ్ నెట్‌వర్క్‌తో సీసీటీవీ సర్వైలెన్స్ ఇప్పుడు మరింత సమర్థంగా మారుతోంది.

పాఠశాలలు, ప్ర భుత్వ కార్యాలయాలు, గ్రామ వీధుల్లో రియల్ టైం మానిటరింగ్, ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. -ఫైబర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల సమాచారమంతా గ్రామాల దాకా సులభం గా చేరుతుంది. రైతులకు రాయితీలు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్లు పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి. ప్రజలు నేరుగా ప్రభుత్వ పోర్టల్లను యాక్సెస్ చేసి స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది.

టీవీనే కంప్యూటర్‌గా మార్చే వీడీఐ టెక్నాలజీ..

ఒక ఇంట్లో కంప్యూటర్ లేకపోయినా టీవీ స్క్రీన్ ముందు కూర్చొని చదవడం, టైపింగ్ చేయడం వంటి వెసులుబాటు కల్పించడమే ఈ వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (వీడీఐ) ప్రత్యేకత. టీవీకి సెటాప్ బాక్స్ ద్వారా కనెక్ట్ అయ్యి క్లౌడ్ డెస్క్‌టాప్ యాక్సెస్ పొందవచ్చు. ఇందులో వర్డ్, ఎక్సెల్, బ్రౌజర్, విద్యా అప్లికేషన్లు ఉపయోగించవచ్చు. దీనివల్ల కంప్యూటర్ కొనే స్తోమత లేని పేద కుటుంబాలకు సైతం డిజిటల్ సమానత్వం సాధ్యమవుతుంది.