15 July, 2026 | 1:51 PM

Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •  

మల్లారెడ్డిని కలిసిన రాంచందర్‌రావు

16-02-2026 01:32 AM

చైర్‌పర్సన్ల ఎన్నికపై చర్చ!

మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదివారం రాత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిశారు. మల్లారెడ్డి తన విద్యాసంస్థ ఆవరణలో శివరాత్రి పర్వదినం సందర్భంగా హోమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును ఆహ్వానించారు. రాంచందర్‌రావు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చు కున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాంచందర్‌రావు మల్లారెడ్డిని కలవడం గుమనార్హం. వీరి మధ్య చైర్‌పర్సన్ల ఎన్నిక విషయమై చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగే చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారా, బీఆర్‌ఎస్‌కు అను కూలంగా వ్యవహరిస్తారా, తటస్థంగా ఉంటా రా అనేది సస్పెన్స్ నెలకొంది.