15 July, 2026 | 1:34 PM

Breaking News

ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •  

ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ

15-07-2026 01:22 PM

హైదరాబాద్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cement Corporation of India) ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయలుదేరింది. కాసేపట్లో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో కేటీఆర్ బృందం భేటీ కానుంది. అదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతిపత్రం సమర్పించనున్నారు. కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్, CCI సాధన సమితి నాయకులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ మాట్లాడతారని పార్టీ నేతలు వెల్లడించారు.