ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు
బోధన్,జూలై 15(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ 'జల జీవన్ మిషన్ అభియాన్'(Jal Jeevan Mission) ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన వర్షపు నీటిని ఎక్కడికక్కడే ఒడిసిపట్టి భూమిలోకి ఇంకేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'జల జీవన్ మిషన్ అభియాన్' లో భాగంగా వర్షపు నీటి సంరక్షణ మరియు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్(Municipal Chairperson), కమీషనర్ మాట్లాడుతూ... "వర్షం ఎక్కడ పడితే అక్కడే ఆ నీటిని భూమిలోకి ఇంకిపోయేలా చేయాలి. అప్పుడే అంతరించిపోతున్న భూగర్భ జలాలను మనం పెంచుకోగలం. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలంటే నీటి సంరక్షణే ఏకైక మార్గం," అని వివరించారు. పట్టణ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు, ప్రతీ ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమీషనర్‌తో పాటు, పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






