నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని ఆర్డీవోకు వినతి
29-06-2026 08:21 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారం బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డికి నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్ , బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్ , దుర్కి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారాగౌడ్ లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోకుండా కాపాడాలంటే నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.






