4 September, 2026 | 10:51 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

గ్రామ పంచాయతీ కార్మికులకు డ్రైవింగ్ లైసెన్స్, సబ్బులు ఇతర వస్తువులు పంపిణీ చేయాలి

29-06-2026 | 08:04pm

సిఐటియు ములకలపల్లి మండల కన్వీనర్ నిమ్మల మధు డిమాండ్

ములకలపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె,ఇతర శానిటేషన్ వస్తువులు తక్షణమే పంపిణీ చేయాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సత్య నారాయణకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు సబ్బులు, కొబ్బరి నూనె, షూ, ఇతర శానిటేషన్ వస్తువులు, పోస్టల్ ఇన్సూరెన్స్ లు,ట్రాక్టర్ డ్రైవర్ లకు గ్రామ పంచాయతీ ల నుంచే చెల్లిస్తామని ఎంపీడీవో సత్య నారాయణ హామీ ఇచ్చారు.

అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులపై అధికారులు, రాజాకీయ నాయకుల జోక్యం ఒత్తిళ్లు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.గ్రామ పంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు వర్క రుక్మధరావు, బోమ్మగాని శంకర్, వగ్గేల ధారయ, కారంపూడి సాయి రత్న, మేకల రమేష్,వెలకం రాఘవులు,వాడే బూజంగ రావు, సిద్దుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.