29 June, 2026 | 9:12 PM

ప్రధాన రహదారిపై వర్షపు నీటి నిల్వ సమస్యకు పరిష్కారానికి చర్యలు

29-06-2026 07:56 PM

* మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా, డ్రైనేజీ వ్యవస్థలోకి సాఫీగా వెళ్లేలా వేములవాడ మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు స్వయంగా పనులను పరిశీలిస్తూ, అధికారులకు అవసరమైన సూచనలు అందించి పనులను దగ్గరుండి చేయించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... వర్షాకాలంలో ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు డ్రైనేజీ మార్గాలను సరిచేసి, వర్షపు నీరు వేగంగా డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.