29 June, 2026 | 9:11 PM

బీఎల్ఏలు ప్రజలను చైతన్యవంతం చేయాలి

29-06-2026 07:54 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ లు ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ బీఎల్ఏ ల మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్ కోరారు. సోమవారం ములకలపల్లి మండలం సీతాయిగూడెం బూత్ 21, 22లో జరుగుతున్న ఏన్యూమరేషన్ ఫారాల పంపిణీని సీతాయిగూడెం సర్పంచ్ కారం చంద్రకళ సుధీర్ కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏన్యూమరేషన్ ఫామ్ లు ఓటర్ల అందరికి ఇవ్వాలని బీఎల్ఏ లు కాంగ్రెస్ నాయకులు ప్రజలను చైతన్యపరిచి ఏన్యుమరేషన్ ఫారాలు తిరిగి బిఎల్వోలుకు అందజేసే వరకు బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బిఎల్ఓ లు రాజేశ్వరి,నాగేశ్వరమ్మ,ఉమ్మడి జగన్నాథపురం బీఎల్ఏ ల అబ్జర్వర్ గుంటూరు సాయి, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొడిమె వంశీ,స్థానిక కాంగ్రెస్ నాయకులు పరమేష్  వార్డు సభ్యులు,బి ఎల్ ఏ లు  పాల్గొన్నారు.