14 March, 2026 | 3:27 AM

కేంద్ర విద్యుత్ అథారిటీ ఆధ్వర్యంలో లైన్‌మ్యాన్ దివస్‌

13-03-2026 10:30 PM

న్యూఢిల్లీ, మార్చి 2026: టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సహకారంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కేంద్ర విద్యుత్ అథారిటీ  'లైన్‌మ్యాన్ దివస్' ఆరవ ఎడిషన్‌ను న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించింది.

దేశవ్యాప్తంగా విద్యుత్ సేవలను నమ్మకంగా అందించడంలో కీలక పాత్ర పోషించే లైన్‌మ్యాన్ , గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది యొక్క అవిశ్రాంత అంకితభావం , అమూల్యమైన సేవలను గుర్తించడం ఈ లైన్‌మ్యాన్ దివస్ ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమానికి భారత విద్యుత్ , నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ హాజరయ్యారు. కార్యదర్శి (విద్యుత్) శ్రీ పంకజ్ అగర్వాల్ కీలకోపన్యాసం చేశారు. సిఈఏ  చైర్‌పర్సన్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్, టాటా పవర్-డిడిఎల్  సీఈఓ  శ్రీ ద్విజదాస్ బసక్, విద్యుత్ రంగం అంతటా సీనియర్ నాయకులు మరియు విశిష్ట వాటాదారులతో కలిసి పాల్గొన్నారు.

భారతదేశం వ్యాప్తంగా  66 కి పైగా రాష్ట్ర , ప్రైవేట్ విద్యుత్ పంపిణీ మరియు ఉత్పత్తి కంపెనీల నుండి సుమారు 250 మంది లైన్‌మెన్ మరియు సూపర్‌వైజర్లు, ట్రాన్స్‌మిషన్ లైసెన్స్‌దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాను నిర్ధారించే ఫ్రంట్‌లైన్ విద్యుత్ రంగ కార్మికుల అంకితభావాన్ని లైన్‌మన్ దివస్ గుర్తిస్తుందని  శ్రీపాద యెస్సో నాయక్ అన్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలను నిరంతరం ఉపయోగించడం, నిర్వహణ పనులు చేపట్టే ముందు సరైన షట్‌డౌన్ నిర్ధారణ, మరియు శిక్షణ ద్వారా కార్యాలయంలో భద్రతా సంస్కృతిని బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.  

ఈ కార్యక్రమ ప్రాముఖ్యత గురించి టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సీఈఓ శ్రీ ద్విజాదాస్ బసక్ మాట్లాడుతూ, “‘లైన్‌మ్యాన్ దివస్’ అనేది మన ఫ్రంట్‌లైన్ యోధులకు అంకితమైన ఒక ప్రత్యేకమైన వేదిక. టాటా పవర్-DDLలో, స్థిరమైన విద్యుత్ రంగం సాధికారత కలిగిన,  రక్షిత ఫ్రంట్‌లైన్ కార్మికులతో ప్రారంభమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నామని అన్నారు.