29 July, 2026 | 1:45 PM

వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

29-07-2026 12:43 PM

పూసుగూడెం రైతు వేదికలో రైతులతో కలిసి 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

ములకలపల్లి, (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న శాస్త్రీయ సలహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులను కోరారు. ములకలపల్లి మండలం పూసుగూడెం రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులతో కలిసి 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ వర్చువల్ ప్రసారాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ వాతావరణ మార్పులు,ఎల్‌నినో ప్రభావం,వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న సలహాల మేరకు తక్కువ నీటి సదుపాయంతో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, కె వి కె భరత్, మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, శంభో శంకర్, సర్పంచులు భూక్య ధర్మ, ఊకే ఆదిలక్ష్మి,కుంజా రవి,వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.