5 August, 2026 | 6:20 PM

ఎమ్మెల్యేను సన్మానించిన గ్రంథాలయ చైర్మన్ గంగరాజు యాదవ్

05-08-2026 05:02 PM

తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తిమండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే మందుల సామేలును, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ లను బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  గ్రంథాలయ చైర్మన్ వీరబోయిన గంగరాజు యాదవ్ శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం శుభ  పరిణామన్నారు. సన్మానించిన వారిలో కాంగ్రెస్ నాయకులు పెద్దబోయిన అజయ్ కుమార్, జై సమ్మిదాన్ మండలం కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో, మరికంటి అశోక్, తదితరులున్నారు.