1 March, 2026 | 5:00 AM

రుద్రారం వద్ద ఆర్టీసీ, ట్రావెల్ బస్సుల ఢీ

01-03-2026 01:43 AM

30 మందికి గాయాలు

సదాశివపేటలో మరో ప్రమాదం

పటాన్‌చెరు/సదాశివపేట, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో జాతీ య రహదారిపై శనివారం నాడు రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో 30 మందికి గాయా లయ్యాయి. పటాన్‌చెరు రుద్రారం వద్ద ముంబై జాతీయ రహదారిపై వరుసగా రెం డు ఆర్టీసీ బస్సులు, ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి.

రుద్రారం బస్టాప్ వద్ద బస్సులో ప్రయాణికులను ఎక్కిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆ సుపత్రికి తరలించారు. కాగా  సదాశివపేట బైపాస్ 65వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది.  జహీరాబాద్ డిపోకు చెందిన బస్సు జహీరాబాద్ నుంచి సదాశివపేటకు వస్తుండగా పీఎస్‌ఎమ్‌ఎల్ బైపాస్ మూలమలు పు హైదరాబాద్ నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.