calender_icon.png 12 February, 2026 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగుదాం..

12-02-2026 12:23:05 AM

సిద్దిపేట రూరల్ ఫిబ్రవరి 11:అధికారులు, సర్పంచ్ లు సమన్వయంతో పరస్పర సహకారం చేసుకుంటూ గ్రామాల అభివృద్దికి ముందుకు సాగుదామని ఎంపీడీవో ఎస్ రామరాజు, ఎమ్మా ర్వో స్వామి లు అన్నారు. బుధవారం ఎంపీడీవో ఆఫిస్ లో మండల పరిధిలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ లకు మండల స్థాయి అధికారుల తో పరిచయ కార్యక్రమం నిర్వహించి, మండలంలో ఉన్న శాఖల పనితీరును, వాటి అవసరాలను వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సంభందిత శాఖల అధికారులను సంప్రదించి, వారి సలహాలు సూచనలు పాటించాలన్నారు. కాగా ఈ కార్యక్రమం లో రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, ఉపాధి హామీ, త్రాగునీటి, వ్యవసాయ శాఖ లకు సంబంధించిన అధికారులు తమ శాఖల పనితీరును వివరించి, వారి సందేహాలను నివృత్తి చేసారు. అనంతరం సర్పంచ్ లను అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రజిత, ఏవో నరేష్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, సెక్రటరీ లు తదితరులు పాల్గోన్నారు.