calender_icon.png 12 February, 2026 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

12-02-2026 12:21:53 AM

సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 11: సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల జెడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో డాక్టర్ బండి శ్రీకాంత్ తన తండ్రి జ్ఞాపకార్థంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బట్టు తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చది వి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు.

ప్రతి సంవత్సరం పరీక్ష సామగ్రిని అం దించడమే కాకుండా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న బండి శ్రీకాంత్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండి గోదావరి, సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కవిత రవీందర్ , కొమ్ము రవీందర్, తదితరులు పాల్గొన్నారు.