15 March, 2026 | 5:30 PM

Breaking News

పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •  

సంగోజిపేట్ శివారులో చిరుత కళేబరం

15-03-2026 01:08 AM

గోర్లు దంతాలను పట్టుకెళ్లిన దుండగులు

బాన్సువాడ మండలంలో ఘటన

నిజామాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): బాన్సువాడ మండలంలోని సంగోజి పేట్ శివారులో గల అటవీ ప్రాంత రాజన్న గుట్ట వద్ద చిరుత పులి కళేబరం కనిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అందరూ అడవి జంతువుల వేటగా ళ్లు పులి గోర్లు కోసమే చిరుతను వధించి ఉం టారని ఇది గుర్తుతెలియని దుండగులు ఇచ్చిన పని అని సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. చిరుతను చంపి చిరుత గోళ్లను దొంగిలించి నట్లు అటవిశాఖ అధికారులు అంచనాకొచ్చారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధి కారులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. పులికి సంబంధించి న గోర్లు పండ్లను చిరుతను చంపిన దుండగు లు దొంగలించినట్టు తెలుస్తోంది.కామారెడ్డి జిల్లా అధికారిని నికిత, బాన్సువాడ ఫారెస్ట్ అధికారి హబీబ్, తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఇద్దరు అనుమాతుని తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు, చిరుత మృతి విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.