దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన శాసనసభ్యులు
గోదావరి పుష్కరాలు నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని
అధికారులను కోరిన శాసనసభ్యులు వెంకటరావు
భద్రాచలం, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం కేంద్రమైన భద్రాచలంలో చేపట్టిన సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునరుద్ధరణ పనులు, 2027 లో వచ్చే గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తిచేసి పుష్కర యాత్రలకు రామయ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు అధికారులను కోరారు. ఆదివారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం తొలి విడత రూ 351 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా ఆదివారం రామాలయంలో నిర్వహిస్తున్న ఆలయ జీర్నోద్ధారణ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి రాబోవు పుష్కరాలని దృష్టిలో పెట్టుకొని పనులు త్వరగా పూర్తిచేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.
దేవాలయం ఈవో దామోదర్ రావు ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులైన ఆలయ ముఖ మండపం చిత్రకూట మండపం, అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించి త వాటి యొక్క విశిష్టతను దేవస్థానం ఈవో దామోదర్ రావుతో కలిసి తెలుసుకున్నారు.
దక్షిణ అయోధ్యగా పేరు ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి ఆలయానికి ఆనాడు భక్త రామదాసు కాలంలో అభివృద్ధి బాటలో ఉండటం మళ్లీ 400 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు సహకారంతో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగటం చాలా సంతోషకరమని, ఈ ఆలయానికి తెలంగాణ, ఆంధ్ర, చత్తీస్ గడ్ , ఒరిస్సా.. దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వచ్చే సంవత్సరం పుష్కరాలకి షుమారు కోటి మంది దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున ఇంత అభివృద్ధి కార్యక్రమం జరగటం నేను స్థానిక శాసనసభ్యులుగా ఉండటం నా పూర్వ జన్మ సుకృతం అని శాసనసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు దేవస్థానం ఈవో దామోదర్ రావు ఏ ఈ ఓ శ్రావణ్ కుమార్. ఆలయ సూపర్డెంట్ శ్రీనివాస రెడ్డి సాయిబాబా, ప్రముఖ సంఘ సేవకులు పట్టణ ప్రముఖులు గాదె మాధవరెడ్డి. ఆలయ ప్రధాన అర్చకులు.. కోటి రామ స్వరూప్, అమరవాది విజయ రాఘవన్, మురళి తదితరులు పాల్గొన్నారు.






