2 May, 2026 | 6:44 AM

సినిమా పేరు.. సింగ్ గీతం

02-05-2026 03:08 AM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్‌లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు సింగీతం. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీ ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు.

వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లపై నాగ్‌అశ్విన్ నిర్మించిన టైటిల్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఈ చిత్రం ఒక రహస్య గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ప్రతాప్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అన్యూహ ప్రపంచంలోకి వెళ్లుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అతను అడుగుపెడతాడు.

అభి వృద్ధి, పరిరక్షణ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుని, తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. యువ నటీనటులు ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో తులసి పీఏ, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అంకూర్ సీ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అరవింద్ మూలే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.