6 March, 2026 | 3:51 AM

అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్స్

06-03-2026 12:09 AM

రోబోటిక్స్ యూనిట్‌లో ఉద్యోగులు తొలగింపు 

వాషింగ్టన్, మార్చి 5: ప్రముఖ ఈ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగుల కు షాక్ ఇచ్చింది. రోబోటిక్స్ యూనిట్‌లోని ఉద్యోగులను తొలగించింది. ఈ లేఆఫ్స్ కారణంగా రోబోటిక్ యూనిట్‌లోని 100 వైట్ కాలర్ జాబ్స్‌పై ప్రభావం పడింది. రోబోట్స్ డిజైనింగ్, ఆటోమేషన్ కోసం ఉపయోగిస్తున్న రవాణా వ్యవస్థలతో పాటు వేర్ హౌస్‌లో పని చేసే వారి ఉద్యోగాలు పోయాయి. గత  ఏడా ది అక్టోబర్ నెలలో 14 వేల మంది , 2026 జనవరి నెలలో ఏకంగా 16 వేల మంది ఉద్యోగులను బయటకు పంపేసింది. లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ గతంలో మాట్లాడుతూ.. కంపెనీ సంప్రదాయంలో భాగంగానే లేఆఫ్స్ జరుగుతు న్నాయని పేర్కొన్నారు.