5 March, 2026 | 3:45 AM

సెమీ తుమీ

05-03-2026 01:35 AM

నేడు భారత్, ఇంగ్లాండ్ సెమీస్

వాంఖేడే వేదికగా నాకౌట్ ఫైట్

తుది జట్టులో మార్పులు లేనట్టే

టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. వాంఖేడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిం డియా ఇంగ్లీష్ టీమ్ అడ్డంకి దాటితే ట్రోఫీకి చేరువైనట్టే. అభిషేక్ పేలవ ఫామ్, మిడిలార్డర్ తడబాటు, స్లాగ్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యం వెంటాడుతున్న వేళ ఇంగ్లాండ్‌కు భారత్ చెక్ పెడుతుందా.. లేక భారత్‌తో పోలిస్తే మంచి ఫామ్‌లో ఉన్న ఇంగ్లీష్ టీమ్ పైచేయి సాధిస్తుందా.. ?

ముంబై, మార్చి 4 : టీ20 ప్రపంచకప్ నాకౌట్ స్టేజ్‌కు చేరుకుంది. 20 జట్లతో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీ మిండియా టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచిం ది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది.

ఈ నాకౌ ట్ ఫైట్‌కు వాంఖేడే స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లలోనూ టీ20 హిట్టర్స్ ఉం డడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. భా రత్ విషయానికొస్తే ఈ వరల్డ్ కప్‌లో అంచనాలకు తగ్గట్టే రాణిస్తున్న టీమిండియాను కొన్ని బలహీనతలు మా త్రం వెంటాడుతున్నాయి. వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం, డెత్ ఓవర్లలో బౌలర్లు పరుగులిచ్చేయ డం తో పాటు పేలమైన ఫీల్డింగ్ తో పలు క్యాచ్‌లు జారవిడిచారు.

ఈ నేపథ్యం లో సెమీఫైనల్‌కు ముందు ఈ బలహీనతలను అధిగమించాల్సిందే. ఎందుకంటే ఇక్క డ అవే తప్పు లు రిపీటయితే మాత్రం ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే భా రత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. వైఫల్యాల బాట వీడని అభిషేక్ శర్మను తప్పిస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం జట్టు వర్గాల సమాచారం ప్రకారం అభిషేక్‌ను కొన సాగించేందుకే గంభీర్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సంజూ శాంసన్, అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. ఇషాన్ కిషన్ వన్ డౌన్‌లో రానున్నాడు. గత మ్యాచ్‌లో సంజూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చాడు. సెమీస్‌లోనూ సం జూపైనే అంచనాలున్నాయి.

అయితే మిడిలార్డర్ లో తడబాటు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా మంచి ఆరంభాలను భారీస్కోర్లుగా మలచలేకపోతున్నారు. దీంతో తర్వాతి బ్యాటర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా విజయాలు వస్తుం డడంతో దీనిని అంతగా పట్టించుకోవడం లేదు. అయితే సెమీఫైనల్లో మాత్రం మరొక అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మిడిలార్డర్ బ్యాటర్లు రాణించాల్సి ఉంటుంది. అటు బౌలింగ్‌లో పేస్ ఎటాక్‌ను బుమ్రానే లీడ్ చేయనుండగా.. మరొక పేసర్‌గా అర్షదీప్ సింగ్ ఉంటాడు.

అటు హార్థిక్ పాండ్యా, దూబే కూడా ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఎటొచ్చీ స్పిన్నర్లే కాస్తో కూస్తో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తున్నారు. దీంతో తుది జట్టు కూర్పును మార్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఇంగ్లాండ్‌ను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేం. కెప్టెన్ హ్యారీ బ్రూక్ తో పాటు ఫిల్ సాల్ట్, ఆదిల్ రషీద్, విల్ జాక్స్, సామ్ కరన్ లాంటి కీలక ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉండడంతో ఇంగ్లాండ్ కూడా పూర్తి కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతోంది. 

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ముంబై వాంఖే డే స్టేడియంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఆరంభంలో కాస్త బౌన్సీతో పేసర్లకు అనుకూలించినా ఓవరాల్‌గా భారీస్కోర్లు నమోదవడం ఖా యం. దీంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు.

తుది జట్లు అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, బుమ్రా

ఇంగ్లాండ్ : ఫిల్ సాల్ట్, బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్) జాకబ్ బెథల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్