సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత
చేవెళ్ల, ఆగస్టు 24 (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిల్ కేంద్రం 14వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహారం పథకంను సోమవారం చేవెళ్ల మున్సిపల్ చై ర్పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశా రు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడు తూ... విద్యార్థులకు పౌష్టికాహారం అందించ డం ద్వారా ఆరోగ్యంతో పాటు విద్యాభ్యాసం మెరుగుపదుతుందని తెలిపారు.
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తి స్థాయి లో దృష్టి సారించగలరని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన అల్పాహారం అందించ డం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాసుల రాముగౌడ్, కౌ న్సిలర్లు శైలజాఆగిరెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






