రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
11-05-2026 11:11 AM
హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్యకేసులో( Retired IPS Officer Wife) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను నేపాల్ కు చెందిన సాహు గ్యాంగ్ గా గుర్తించారు. ఈ ముఠా ఢిల్లీ జైలు నుంచి స్కెచ్ వేసింది. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను అటాచ్ చేసిన కల్పన దోపిడీకి పాల్పడింది. దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు కల్పన కోసం పోలీసులు పుణెలో గాలిస్తున్నారు.






