అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య
అమరావతి: కాకినాడలోని గాంధీనగర్‌లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (Andhra Pradesh Special Police) కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నిందితుడు మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేసి అక్కడికక్కడే అతన్ని హతమార్చాడు. క్లూస్ టీమ్,వేలిముద్రల నిపుణులు నేర స్థలం నుండి నమూనాలను సేకరించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదనిపోలీసులు తెలిపారు.
నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాంధీనగర్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు సీనియర్ పోలీసు అధికారులు కూడా ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






