పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది
సమయపాలన పాటించాలి. పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
జనరల్ ఆసుపత్రి సందర్శనలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సుదూర ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేద రోగులకు(Poor Patients) మెరుగైన కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నదని సమయపాలన పాటిస్తూ వారికి అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం ఉదయాన్నే జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించి ఓపి కౌంటర్, ఇన్ పేషంట్, ఇతర విభాగాలు, పారిశుధ్యంపై ఆరా తీశారు.
నేరుగా రోగులతో మాట్లాడుతూ సౌకర్యాలు వైద్యుల తీరు వివరాలను కనుక్కున్నారు. ఆస్పత్రి పరిసరాలల్లో దుర్గంధం వెదజల్తోందని పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యులు సైతం సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండాలని లేదంటే శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ పర్యటన ముందే తెలుసుకున్న ఆసుపత్రి అధికారులు ముందు రోజే వార్డులు, పరిసరాలు శుభ్రపరిచారు. ఉదయాన్నే ఎక్కువ సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులోకి రావడం విశేషం.






