11 May, 2026 | 12:36 PM

Breaking News

మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •  

National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు

11-05-2026 11:30 AM

హైదరాబాద్: ప్రగతికి దారి చూపుతూ, భవిష్యత్ తరాలకు ప్రేరణనిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 'జాతీయ సాంకేతిక దినోత్సవం'(National Technology Day) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, భవిష్యత్ సవాళ్లను అధిగమించడం కోసం టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని భారత టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.