రాజాపూర్‌లో కుంగిన భూమి
- భయాందోళనలో గ్రామస్తులు
- సింగరేణి బ్లాస్టింగ్‌తోనే అనే ఆరోపణలు
- సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్
పెద్దపల్లి, ఆగస్టు 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో ఆదివారం ఉన్నట్టుండి భూమి కుంగిపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సింగరేణి ఓసీపీ విస్తరణలో భాగంగా గ్రామానికి సమీపంలో జరుగు తున్న బ్లాస్టింగ్ కారణంగానే భూమి కుంగిపోతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పుల్లెల సుధాకర్ ఇంటి సమీపంలో భూమి కుంగి పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.
కుంగిన ప్రాంతంలో ఇనుప రాడ్‌ను దించగా సుమారు 14 అడుగుల లోతు వరకు వెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో భూమి లోపల ఖాళీలు ఏర్పడి కుంగిపోతుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెం దుతున్నారు. ఇప్పటికే సింగరేణి బ్లాస్టింగ్స్ ప్రభావంతో ఇళ్లకు పగు ళ్లు ఏర్పడుతున్నాయని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే సంఘటనా స్థలాన్ని పరిశీలించి భూమి కుంగే ందుకు కారణాలను శాస్త్రీయంగా చేపట్టాలని, బ్లాస్టింగ్‌ల ప్రభావంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.






