calender_icon.png 13 February, 2026 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

13-02-2026 12:00:00 AM

నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మండలంలోని వదల్పర్తి గ్రామంలో పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ నిర్వహణ పనులను గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజ నాన్ని అందించాలన్నారు.

గ్రామంలో క్ర మం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని,కూలీలందరూ పనులకు హాజరయ్యేలా చూడాలని క్షేత్ర సహాయకులను (ఏపీఓ/టీఏ) ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి గరిష్ట కూలి పొందేలా జాగ్రత్త వహించాలని కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అజ్జిమొద్దీన్, ఫీల్ అసిస్టెంట్ నరసింహులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.