1 June, 2026 | 5:06 AM

శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

01-06-2026 02:35 AM

అలరించిన బెంగళూరు, హిందూపురం కళాకారులు  

శేరిలింగంపల్లి, మే 31 (విజయక్రాంతి): మాదాపూర్లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. బెంగళూరు నుంచి విచ్చేసిన కూచిపూడి నాట్యకళాకారిణి కుమారి అనఘా ప్రకాష్ శిష్య బృందం పూర్వరంగం, భో శంభో, తరంగం అంశాలను ప్రదర్శించి మెప్పించింది. కళాకా రులు శాలివి, గంగిశెట్టి, ఆరిన, హాసిని, అవ్యుక్త, సౌ మ్యలు తమ అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

అనంతరం హిందూపురం నుంచి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువు శ్రీమతి విద్యాధరి బృందం ప్రదర్శన ఎంతగానో అలరిం చింది. గణపతి తాళం, జతి స్వరం, జనుత శబ్దం, అష్టపది, ప్రహ్లాద పట్టాభిషేకం, కృష్ణం కలయ సఖి, దశావతార శబ్దం, మండూక శబ్దం తదితర అంశాలను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. శిల్పారామం ఆంఫీ థియేటర్ ప్రాంగణం నాట్య విన్యాసాలతో కళకళలాడింది. ప్రతి శని, ఆదివారాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.