11 May, 2026 | 2:09 PM

Breaking News

విద్యార్థినుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పిస్తాం   •   కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   ప్రారంభమైన నివాసాలకు గుర్తింపు   •   వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు   •   యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!   •   మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •  

కేటీఆర్ ఫోటోకి పాలాభిషేకం

22-11-2025 07:32 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఈరోజు తంగళ్ళపల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఫోటోకు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఆటో డ్రైవర్ల కోసం తన స్వంత నిధులతో ₹5 లక్షల బీమా అందజేయడం పట్ల కేటీఆర్‌కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు బొల్లి రామ్మోహన్, తంగళ్ళపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు బండి యోగితో పాటు పెద్ద సంఖ్యలో ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి వారిని మరింతగా ఆదుకోవాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి ₹20 వేల వేతనం అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ సభ్యులు కేటీఆర్ చేసిన సహాయానికి రుణపడి ఉంటామని, ఇది ఆటో డ్రైవర్లకు పెద్ద భరోసా అని వెల్లడించారు.