పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సిరిసిల్ల, మే 2 ( విజయక్రాంతి ) సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ’గిఫ్ట్ ఏ స్త్మ్రల్’ కార్యక్రమంలో భాగంగా ట్యాబులను పంపిణీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ కానుకను అం దించడం ఎంతో సంతోషకరమని విద్యార్థు లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
రా జన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే ఎనిమిది చోట్ల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థా యిలో తీర్చిదిద్దామని, తన ఆలోచన, కల కేవ లం ఈ ఎనిమిది పాఠశాలలకే పరిమితం కాదని స్పష్టం చేశారు.భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా జిల్లాలో దాదాపు 6 వేల మంది విద్యార్థులకు ఐపాడ్లను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఉన్నత లక్ష్యాలు, గొప్ప భవిష్యత్తు
విద్యార్థులు కేవలం పదవ తరగతితోనే ఆగిపోకుండా, విద్యాసంస్థల్లో సీట్లు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. పిల్లలు చదువులో రాణించి ఉన్నత స్థానాల్లో ఉంటే, ఆ సంతోషం తల్లిదండ్రులకు మించినది మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.






