26 July, 2026 | 11:43 AM

PRANA24 డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ

26-07-2026 10:31 AM

హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించిన PRANA24 డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌ను హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... ఆరోగ్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు వేగవంతమైన, నమ్మకమైన, అందుబాటులో ఉండే సేవలను అందించే దిశగా PRANA24 చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందించారు. రాష్ట్రంలో డిజిటల్ హెల్త్‌కేర్ సేవల విస్తరణకు ఇటువంటి వినూత్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో PRANA24 వ్యవస్థాపక బృందం పాల్గొంది. వారిలో:

- జి. అనుదీప్ – మేనేజింగ్ డైరెక్టర్ (MD)

-వంశీకృష్ణ టి – చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)

- స్వాతి – చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO)

- సుధీర్ – ప్రొడక్ట్ ఓనర్ (PO)

- అనిల్

- ధాక్షేష్

- ప్రీత్

ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ జి. అనుదీప్ మాట్లాడుతూ, PRANA24 ద్వారా వైద్యులు, క్లినిక్‌లు, ఫార్మసీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు మరియు రోగులను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానం చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. సీటీఓ వంశీకృష్ణ టి మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికత, భద్రత, వేగవంతమైన పనితీరు, వినియోగదారులకు అనుకూలమైన రూపకల్పనతో PRANA24ను అభివృద్ధి చేశామని, భవిష్యత్ ఆరోగ్య సేవల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి వైద్యులు, ఆరోగ్య రంగ ప్రముఖులు, ఐటీ నిపుణులు, ఆహ్వానితులు మరియు మీడియా ప్రతినిధులు హాజరై PRANA24 బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. PRANA24 ప్రారంభం భారతదేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

PRANA24 గురించి:

PRANA24 అనేది ప్రజలకు మందులు, వైద్య సేవలు, డయాగ్నస్టిక్ సేవలు మరియు ఇతర ఆరోగ్య సంబంధిత సేవలను ఒకే డిజిటల్ వేదిక ద్వారా సులభంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించిన సమగ్ర హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్.