3 June, 2026 | 1:28 AM

శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ పోలీసులు అనేక సంస్కరణలు

03-06-2026 12:48 AM
  1. సాంకేతిక పోలీసింగ్, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి
  2. తెలంగాణ అవతరణ వేడుకల్లో సీపీ సజ్జనర్ కీలక సందేశం

బంజారాహిల్స్,జూన్ 2: ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతల పరిరక్షణలో హైద రాబాద్ పోలీసులు అనేక సంస్కరణలు చేపడుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. తెలం గాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేట్లబురుజులోని సిటీ ఆరమ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్క్వార్టర్స్లో మంగళవా రం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వి. సి. సజ్జనర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించా రు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ కార్యక్రమం ద్వారా దాదాపు 20 వేల మంది సిబ్బందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక హెల్త్ ప్రొఫైలింగ్ చేపట్టినట్లు వెల్లడించారు.

ప్రతి పోలీస్ స్టేషన్లో హెల్త్ వలంటీర్లను నియమించి సిబ్బంది ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆధునిక పోలీసింగ్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని విస్తరిస్తున్నామని పేర్కొన్న సీపీ, ‘సీ-మిత్ర’ వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ద్వారా బాధితులు ఇంటి నుంచే ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.

ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 1,130 జీరో ఎఫ్‌ఐఆర్లు, 380 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.అదేవిధంగా ‘ఏఐ కాప్రైటర్’ యాప్ ఫిర్యాదుల నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా, ‘సాక్-ఐ’ అప్లికేషన్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రతకు ముప్పుగా మారే ఆన్లైన్ కంటె్ంప నిఘా పెంచినట్లు చెప్పారు.

ఆహార కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన ‘హెచ్-ఫాస్ట్’ విభాగం తక్కువ వ్యవధిలోనే 173 కేసులు నమోదు చేసి, సుమారు 95 టన్నుల కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుందని సీపీ వెల్లడించారు.‘స్పందన-తక్షణ రక్షణ’ రెస్పాండర్ బృందాలు రోజుకు సగటున 30 ఫిర్యాదులను స్వీకరిస్తూ వేగవంతమైన సేవలు అందిస్తున్నాయని, ఇప్పటికే వెయ్యికి పైగా కాల్స్కు స్పందించినట్లు తెలిపారు.

త్వరలో 300 మంది మహిళా సిబ్బందికి డ్రైవింగ్ శిక్షణ అందించి పెట్రోలింగ్, బ్లూకో ట్స్ సేవల్లో భాగస్వామ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.పోలీసు సిబ్బంది నైపుణ్యాభివృద్ధి కోసం 14 ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కింద రికార్డు స్థాయిలో 2.30 లక్షల గంటల శిక్షణ అందించినట్లు వెల్లడించారు.సైబర్ నేరాలపై ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముం దుకు సాగుతున్నామని, ‘సైబర్ సింబా’ వ లంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హెచ్-న్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని,మాదకద్రవ్యాల వ్యవహారాల్లో ఎంతటి వారైనా ఉపే క్షించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ను మరింత సురక్షితమైన విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, డ్రగ్స్, ఆహార కల్తీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారాన్ని డయల్- 100కు అందించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో పలువురు ఉన్నత పోలీసు అధికా రులు, జోనల్, ట్రాఫిక్, సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల డీసీపీలు, సిబ్బంది పాల్గొన్నారు.