కేటీఆర్ నువ్వు ఎన్‌ఆర్‌ఐ కోటాలో పోటీ చేశావ్
01-06-2026 12:29 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): కేటీఆర్ నువ్వు ఎన్‌ఆర్‌ఐ కోటాలో తెలంగాణలో పోటీచేశావని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్- విమర్శించారు. కేటీఆర్ ఇదే నా ఛాలెంజ్, బీఆర్‌ఎస్ హాయాంలో ఒక్క గురుకుల భవనం నిర్మించినా తాను దేనికి అంటే దానికి సిద్ధమన్నారు. పదేళ్లు రాజుగా కేటీఆర్ విర్రవీగారని, అమెరికా నుంచి వచ్చి మహేందర్‌రెడ్డి టిక్కెట్ లాక్కొని కేటీఆర్ పొటీ చేశారన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సీఎం వరకు ఒక్కో మెట్టు ఎక్కుతూ రేవంత్‌రెడ్డి వచ్చారని, మెరిట్ కోటాలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారన్నారు. గురకులాల్లో మా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించిందన్నారు.






