18 March, 2026 | 1:01 PM

మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?

18-03-2026 11:15 AM

మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం చెబుతుంది ఒకటి.. చేస్తున్నది మరొకటి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ... మూసీ డీపీఆర్(Musi Beautification) తయారు చేసేందుకు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని, ఇప్పుడేమో డీపీఆర్ పూర్తయిందని మంత్రి చెబుతున్నారు?, 18 నెలలు పడుతుందని చెప్పి.. రెండు నెలల్లోనే ఎలా తయారైంది? అని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ప్రశ్నించారు.

ఒక వేళ డీపీఆర్ పూర్తయి ఉంటే.. మా ముందు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డీపీఆర్ తమకు ఇంతవరకు అందలేదని ఏడీజీ చెబుతుందన్నారు. డీపీఆర్ తయారు కాకుండా.. తయారైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ డీపీఆర్ బాధ్యతలను మెయిన్ హార్ట్ కు అప్పగించారని కేటీఆర్ పేర్కొన్నారు. మెయిన్ హార్ట్ సంస్థపై పాకిస్థాన్  ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు పెట్టిందని స్పష్టం చేశారు.