6 May, 2026 | 5:10 PM

స్వర్ణ నంది విజేత డా. ప్రకృతి ప్రకాష్‌కు ఘన సత్కారం

06-05-2026 04:35 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు డా. ప్రకృతి ప్రకాష్‌కు ఇటీవల లభించిన ప్రతిష్టాత్మక “స్వర్ణ నంది” పురస్కారం సందర్భంగా గ్రామంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు.గత 20 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ప్రకృతి ప్రకాష్ చెట్ల నాటకం, విత్తనాల సేకరణ, సీడ్ బాల్స్ తయారీ చేసి డ్రోన్ సహాయంతో అడవుల్లో వెదజల్లడం వంటి కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. ఆయనకు ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు, గౌరవ డాక్టరేట్ లభించాయి.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సినీ నటుడు డా. బాబు మోహన్ చేతుల మీదుగా స్వర్ణ నంది పురస్కారం అందుకున్న నేపథ్యంలో గ్రామస్తులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ డా. ప్రకృతి ప్రకాష్ సేవలు గ్రామానికి గర్వకారణమని కొనియాడారు.