6 May, 2026 | 5:34 PM

Breaking News

కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •   కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ   •  

మమతకు ప్రతిపక్ష పార్టీల మద్దతు

06-05-2026 04:49 PM

ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకూడదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయానికి శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) బుధవారం మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ చేస్తున్న నిరసనలో ఇది ఒక భాగమని అభివర్ణించారు. 

పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియలు అణచివేయబడ్డాయని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి కేంద్ర సంస్థలను, పరిపాలనా యంత్రాంగాన్ని వినియోగించుకున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష NCP (SP) కూడా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి బెనర్జీకి మద్దతుగా నిలిచింది. విలేకరులతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "కేంద్రం నియంతృత్వం, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరికి" వ్యతిరేకంగా ఏకం కావడం అత్యవసరమని ఉద్ఘాటించారు. ఎన్నికల సంఘం కేంద్రానికి బానిసగా మారిపోయిందని ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాల్లో ఓట్ చోరీ చేసిందని మమతా బెనర్జీ ద్వజమెత్తారు.