6 May, 2026 | 5:10 PM

పంటల మార్పిడితో అధిక లాభాలు

06-05-2026 04:32 PM

మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పంటల మార్పిడి వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు, బుధవారం  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయనైనది.  ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి సందేశం, తెలంగాణ గీతంతో ప్రారంభించి మొదటగా మార్కెట్ విధానం పై ఈనామ్ గోదాం నిలువలపై కొనుగోలు అమ్మకాలపై వివిధ పంటల నాణ్యత ప్రమాణాలపై కనీస మద్దతు ధరల గురించి తెలియజేశారు.

అలాగే మార్కెట్లో ఉన్న వివిధ పరికరాలపై తేమ ధాన్య మారబెట్టే యంత్రాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక కార్యదర్శి నారా మనోహర్  రైతులకు అవగాహన చేశారు , అలాగే మండల వ్యవసాయ అధికారి  పైడితల్లి యూరియా మరియు సాగు పంటలపై తక్కువ మందులు వాడాలని దాని ద్వారా ఖర్చు తగ్గి ఆరోగ్యకరమైన తక్కువ మందులు వాడాలని రైతుల కు సూచించారు,  పిఎసిఎస్ సుల్తానాబాద్ చైర్మన్  శ్రీ గిరి శ్రీనివాస్ వారి బ్యాంకు విధానాలపై స్వల్పకాలిక దీర్ఘకాలిక మంజూరి గురించి రైతులకు తెలియజేయడం జరిగింది.

కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి క్షేత్రం శాస్త్రవేత్త  వెంకటేశ్వర్లు  భూసారంపై తగిన సూచనలు మేలుకువలు మేనేజ్మెంట్ విధానం గురించి సాగు విధానాలపై తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు కందునూరి పోచన్న , బొజ్జ మల్లయ్య , అమినోదిన్, ఇల్లందు శ్రీనివాస్ , పిఎసిఎస్ సభ్యులు  ఓదెలు, మార్కెట్ కమిటీ సిబ్బంది,  రైతులు, మహిళ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.