6 May, 2026 | 4:40 PM

తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రాస్తారోకో

06-05-2026 04:16 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా రైతుల వద్ద కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ నాయకులు లక్షెట్టిపేట మండలం కొత్తూరు ప్రమాదానికి కారణమైన షెడ్డును, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంచిర్యాల - ఆదిలాబాద్ రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హామి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో ప్రాంతానికి డీఆర్డీఓ కిషన్, డీఏఓ సురేఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకోని జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడించి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.